Page Loader
MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు
MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు

MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు

వ్రాసిన వారు Stalin
Dec 19, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా లోపంపై మంగళవారం కూడా లోక్‍‌సభ దద్దరిల్లింది. దీంతో మరో 49 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభలో 92 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ గురైన విషయం తెలిసిందే. తమ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శిస్తున్నాయి. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చారు.

ప్రతిపక్షాలు

ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్న మోదీ సర్కార్: ఖర్గే 

పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 141కి చేరింది. సోమవారం నాడు 46 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి, 45 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం 141 మంది ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని, ఎటువంటి చర్చ లేకుండా ముఖ్యమైన చట్టాన్ని సభలో ఆమోదించడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. నిరంకుశ మోదీ ప్రభుత్వం ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని అన్నారు.