Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం.. దిల్లీకి వెళ్లిన సీఎం
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హీటెక్కాయి. తాజాగా తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఎనిమిది నెలలుగా అదే కేబినెట్ ప్రభుత్వ కార్యకలాపలాను పర్యవేక్షిస్తోంది. అయితే మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకొనే అవకాశం ఉన్నప్పటికీ అప్పట్లో సాధ్యం కాలేదు. ఇక శాసనమండలిలో ఖాళీల భర్తీ, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు రావడంతో వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి వస్తుందనే కారణంతోనే మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడ్డాయి.
మంత్రి రేసులో సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం వివేక్, ప్రేమసాగర్ రావు
తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం వివేక్, ప్రేమసాగర్ రావు, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, రామచందర్ నాయక్, మదన్ మోహన్ రావులకు బెర్త్ కన్‌ఫర్మ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దేశ రాజధానిలో దిల్లీకి ఇవాళ వెళ్లనున్నారు.