LOADING...
Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే..
ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే..

Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అటవీ ప్రాంతాల పక్కన ఉన్న పంట పొలాల్లోకి చొచ్చుకొని వెళ్లి నష్టం కలిగించడమే కాదు, గ్రామాలపై కూడా దాడులకు తెగబడి, అనేక మంది రైతులు, గ్రామస్తుల ప్రాణాలను బలితీసుకున్నాయి ఏనుగుల గుంపులు. ఈ తరహా ఘటనలతో అటవీ ప్రాంతాల సమీపంలో నివసిస్తున్న రైతులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఈ సమస్య తీవ్రతను గమనించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కీలక చర్య తీసుకున్నారు. ఈ నేపథ్యంలో,కుంకీ ఏనుగులను వినియోగించాలన్న నిర్ణయాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్,ఈ ఉద్దేశంతో బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు నిర్వహించారు. అనంతరం కర్ణాటక మంత్రి అమరావతి వచ్చిన సమయంలో,రెండు రాష్ట్రాల మధ్య కుంకీ ఏనుగుల అప్పగింతపై అధికారిక ఒప్పందం కుదిరింది.

వివరాలు 

కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నేమ్‌బోర్డులు 

ఈ ఒప్పందం ప్రకారం, కర్ణాటక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి కుంకీ ఏనుగులను అందించబోతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వనున్నారు. వాటి పేర్లు ముందుగానే ప్రకటించారు. 1. రంజని, 2. దేవా, 3. కృష్ణా, 4. అభిమన్యు, 5. మహేంద్ర. ఈ కుంకీ ఏనుగుల పేర్లను ప్రదర్శించే ప్రత్యేక నేమ్‌బోర్డులను కూడా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బోర్డులు కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌,ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుంకీ ఏనుగులకు సంబంధించిన నేమ్‌ బోర్డులు