
Tahawwur Rana : తహవూర్ రాణా కోరిన మూడు వస్తువులు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై 26/11 ఉగ్రదాడిలో ప్రధాన పాత్ర పోషించిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ ఉగ్రవాదిని దిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కార్యాలయంలో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
శుక్రవారం భారత్‌కు వచ్చిన తహవూర్ రాణాను కోర్టు 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
విచారణలో తహవూర్ రాణా డిమాండ్లు
విచారణ కొనసాగుతున్న సమయంలో తహవూర్ రాణా కొంతమంది అధికారులను కొన్ని వ్యక్తిగత అవసరాల కోసం అభ్యర్థించాడు.
అతను కోరిన వాటిలో పెన్ను, పేపర్లు, అలాగే ఖురాన్ ఉన్నాయి.
అధికారుల అనుమతితో వీటిని అతనికి అందజేశారు. అతనికి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా, ఇతర సాధారణ ఖైదీల మాదిరిగానే విచారణ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Details
ఉగ్ర సంబంధాలపై లోతైన దర్యాప్తు
తహవూర్ రాణా గత ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం అందించవచ్చన్న అభిప్రాయంతో దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా పని చేస్తున్నాయి.
అతని పాత అనుబంధాలు, సహచరులు, అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో అతనికి ఉన్న సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ కేసుపై దేశవ్యాప్తంగా ప్రజలు, భద్రతా సంస్థలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి.
రాణా విచారణలో ఏ విధమైన కీలక సమాచారం బయటపడుతుందన్న ఉత్కంఠ నెలకొంది.