Page Loader
Bela Trivedi: ఎస్సీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించడానికి కారణమిదే
ఎస్సీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించడానికి కారణమిదే

Bela Trivedi: ఎస్సీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించడానికి కారణమిదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2024
06:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోటాలో సబ్ కోటా ఉండడం తప్పెమీ కాదని స్పష్టం చేసింది. ఈ తీర్పును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఇందులో ఆరుగురు సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, జస్టిసస్ బేలా త్రివేది మాత్రం విభేదించింది. షెడ్యూల్ కులాల్లో మళ్లీ ప్రత్యేకంగా గ్రూపులు తీసుకు రావడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఇచ్చేది వెనుకబడిన ఎస్సీ వర్గానికి చేయూతను అందిచడానికే అని, మళ్లీ అందులో వర్గీకరణ ఎందుకు చేయాలని ప్రశ్నించింది.

Details

6:1 మెజార్టీతో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు

షెడ్యూల్ కులాలకు ప్రత్యేకంగా హోదా కల్పించేందుకు రిజర్వేషన్ వ్యవస్థ ఉందని, ఇందులో మార్పులు మాత్రం రాష్ట్రపతి ద్వారానే జరగాలన్నారు. రాజకీయ కారణాలతోనే ఆ అధికారం రాష్ట్రాలకు ఇవ్వలేదన్నారు. ఇక మిగతా ఆరుగురు జస్టిస్‌లు ఒకే అభిప్రాయానికి రావడంతో 6:1 మెజార్టీతో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మరోవైపు 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రివ్యూ చేయాలని సీనియర్ అడ్వకేట్ లు కోరారు.