కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచేలా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉదయం అంకురార్పణ పూజతో ప్రారంభమయ్యే ఈ వేడుక, ప్రధాని ప్రసంగంతో ముగుస్తుంది.
ఈ ప్రారంభోత్సవానికి సంభంధించిన షెడ్యూల్‌ను ఒకసారి తెలుసుకుందాం.
ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు వేదపండితులు 'సెంగోల్' ప్రతిష్టాపనకు ప్రత్యేక పూజలు చేయడంతో ప్రారంభోత్సవ వేడుకలు మొదలవుతాయి.
పూజలో పాల్గొనే ప్రముఖులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు.
ఆ తర్వాత స్పీకర్ కుర్చీకి సమీపంలో 'సెంగోల్'ని ప్రతిష్ఠించి జాతికి అంకితం చేయనున్నారు.
దిల్లీ
మధ్యాహ్నం 12గంటలకు కొత్త పార్లమెంట్ ప్రారంభం
ఉదయం 9.00 గంటలకు, ప్రముఖ వేద పండితులు, మఠాధిపతులు, సాధువులతో సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందిస్తారు.
మధ్యాహ్నం 12గంటలకు జాతీయ గీతాలాపన అనంతరం కొత్త పార్లమెంట్‌ను మోదీ ప్రారంభించి జాతిక అంకితం చేస్తారు.
ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనం ప్రాముఖ్యతను తెలియజేసే రెండు లఘు చిత్రాలను ప్రదర్శించనున్నారు.
అనంతరం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన సందేశాలను చదివి వినిపిస్తారు.
ఆ తర్వాత దేశ చరిత్రలో ఈ మైలురాయిని స్మరించుకుంటూ స్మారక నాణెం, స్టాంపును విడుదల చేస్తారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ముగియనుంది.