Page Loader
Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు 
హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు

Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2024
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత బుధవారం నాడు మధు అనే వ్యక్తి కుటుంబం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వెళ్తుండగా, వారి పెంపుడు కుక్క హస్కీ అదే ప్రాంతంలో నివసించే ధనుంజయ్ కుటుంబ సభ్యునిపై దాడి చేసి కరిచింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరగడంతో అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు.

Details 

 శ్రీనాథ్‌పై కర్రలతో దాడి 

ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతికారంతో రగిలిపోయాడు. దాడి చేసేందుకు అవకాశం కోసం వేచి చూశాడు. ఇదిలా ఉండగా..మంగళవారం సాయంత్రం మధు సోదరుడైన శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్ కు బయలుదేరాడు. ఇది చూసిన ధనుంజయ్ మరికొంత మంది శ్రీనాథ్‌పై కర్రలతో దాడి చేశారు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి రాజేశ్వరి, సోదరి స్వప్నపై కూడా దాడి చేసి కుక్కను కూడా కర్రలతో కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. IPC సెక్షన్లు 147, 148,307 r/w 34, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11(1) కింద కేసు నమోదు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీనాథ్‌, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి దృశ్యాలు