Page Loader
Covid 19: ఏపీలో కొత్తగా మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం 
ఏపీలో కొత్తగా మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం

Covid 19: ఏపీలో కొత్తగా మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

కరోనా వైరస్ మళ్లీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండగా, ఇప్పటికే ఈ సంఖ్య వెయ్యి మార్క్‌ను అధిగమించినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో మూడు పాజిటివ్ కేసులు బయటపడగా, ప్రజల్లో భయం నెలకొంది.

Details

ఏలూరులో భార్యాభర్తలకు కరోనా

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఏలూరుకు చెందిన ఒక భార్యాభర్తకు కరోనా ప్రబలినట్లు నిర్ధారించారు. ఇక మరో కేసు తెనాలిలో వెలుగు చూసింది. అక్కడకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడగా, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంతవరకూ రాష్ట్రంలో మొత్తం ఇద్దరికి కరోనా నిర్ధారణ కాగా, దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వెయ్యిని దాటినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.