Delhi: దిల్లీలో నీటి మునిగిన కోచింగ్ సెంటర్.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి
దేశ రాజధాని దిల్లీ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ సివిల్స్ శిక్షణా కేంద్రం బేస్‌మెంట్‌లోకి వరద నీరు రావడంతో అందులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షానికి డిల్లీలోని రాజేంద్రనగర్ రౌస్ ఐఏఎస్ స్టడి సర్కిల్ భవనం మొత్తం నీటితో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో నీటికి బయటికి పంపినా అప్పటికే విద్యర్థులు ప్రాణాలు కోల్పోయారు.
నివేదిక సమర్పించండి : దిల్లి మంత్రి అతిషి
ముందుగా ఇద్దరు యువతులు మృతదేహాలు లభ్యం కాగా, శనివారం అర్ధరాత్రి తర్వాత ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు దిల్లీ డిప్యూటీ కమిషనర్ హార్షవర్దన్ పేర్కొన్నారు. ముగ్గురు విద్యార్థులు చనిపోవడం బాధాకరమని, వెంటనే దీనిపై అధికారులు నివేదిక సమర్పించాలని దిల్లీ మంత్రి అతిషి ఆదేశించారు.
ప్రమాద ఘటనను తెలుసుకున్న దిల్లీ మేయర్
మరోవైపు దిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ చేరుకొని ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా గుర్తించారు. ప్రస్తుతం బేస్‌మెంట్ నుంచి నీటిని బయటకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 23న భారీ వర్షం కారణంగా సివిల్ అభ్యర్థి ఒకరు ఇదే ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే.