Page Loader
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్ 
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్ 

వ్రాసిన వారు Stalin
Dec 05, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సీఎం ఎవరనేదానిపై కాంగ్రెస్‌లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తీవ్రమైన చర్చల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎంగా ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుతున్నాయి. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ పరిశీలకులతో చర్చల అనంతరం రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌కు అనూకూలంగా ఆయన చేసిన వాఖ్యలు చేశారు. 7న ఉదయం 11గంటలకు మంచి ముహూర్తం ఉండటంతో అదేరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

రేవంత్

రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి ఉండదని ఏఐసీసీ స్పష్టం

ముఖ్యమంత్రి పదవి రేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. అయితే వీరికి ఉప ముఖ్యమంత్రి పదవి లేదా మంచి పోర్ట్‌ఫోలియోలో స్థానం కల్పించవచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలో రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఏఐసీసీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. 2017లో ఆయన తెలుగుదేశం పార్టీ (టిడిపి) నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాయి. రేవంత్ రాకతో కాంగ్రెస్‌లో ఊపు వచ్చింది. 2021లో రేవంత్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇక అక్కడి నుంచి క్రమంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64సీట్లలో విజయం సాధించి.. మెజార్టీని సాధించింది.