Page Loader
TirumalaTirupati Devasthanam board: చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ ఏఈవోపై సస్పెన్షన్ వేటు..
చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ ఏఈవోపై సస్పెన్షన్ వేటు..

TirumalaTirupati Devasthanam board: చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ ఏఈవోపై సస్పెన్షన్ వేటు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నియమాలను ఆయన ఉల్లఘించినట్లు విచారణలో తేలింది. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఒక చర్చిలో ప్రార్థనలు చేసిన విషయాన్ని అక్కడి భక్తుల్లో ఒకరు గుర్తించి, ఆ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించిన టీటీడీ అధికారుల దర్యాప్తులో, రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లే విషయం బయటపడింది. ఈ విషయాన్ని వెల్లడించిన నివేదికను ఆధారంగా తీసుకుని, టీటీడీ ఈవో శ్యామలరావు ఆయనను సస్పెండ్ చేశారు.

వివరాలు 

తిరుమల పవిత్రతను పరిరక్షించడమే ప్రధాన కర్తవ్యం 

ఇకపోతే, గత పదేళ్లుగా టీటీడీలో స్వీపర్ స్థాయి నుండి డిప్యూటీ ఈవో స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను టీటీడీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. సంస్థ ధార్మికతను కాపాడడం, తిరుమల పవిత్రతను పరిరక్షించడమే ప్రధాన కర్తవ్యమని టీటీడీ ఛైర్మన్‌తో పాటు సభ్యులు స్పష్టంగా తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టిటిడి చేసిన ట్వీట్