TISS: టిస్ హానర్ కోడ్ లో మార్పు.. విద్యార్థుల నోటికి తాళం
అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు కల్చరల్ ఆక్టివిటీస్ లేదా స్పోర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ అందిస్తాయి.. లేదా 6వ తరగతి నుండి సివిల్స్ పాఠాలు అందిస్తాయి. జేఈఈ మెయిన్స్ గురించి కూడా సమాచారం ఇస్తాయి. కానీ, కొన్ని కళాశాలలు మాత్రం విద్యార్థులకు వివిధ నిబంధనలను అమలు చేస్తూ, రాజకీయ ఆందోళనలకు, దేశ వ్యతిరేక చర్యలకు, ధర్నాలకు, రాజకీయ చర్చలకు, సామాజిక సమస్యలపై గళం లేవనెత్తడం వంటి చర్యలకు ప్రతిఘటన చేస్తుంటాయి. ఇలాంటి షరతులను విధిస్తున్న విద్యా సంస్థలు ఎక్కడున్నాయా అనుకుంటున్నారా.. ముంబైలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ''టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియల్ సైన్సెస్'' (TISS) ఈ విధమైన నిబంధనలను అమలు చేస్తోంది.
బీబీసీ డాక్యుమెంటరీ కలకలం
ఇక్కడ విద్యార్థులు అడ్మిషన్ పొందాలంటే ఈ షరతులకు ఒప్పుకోవడం తప్పనిసరి. ఈ షరతులను ఒప్పుకున్న తరువాత కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలకు లోనవ్వడం అనేది 'హానర్ కోడ్' పేరిట పిలువబడుతుంది. టిస్(TISS)లో ఇంతకముందు కొన్ని దేశ వ్యతిరేక చర్యలు జరిగాయి. గుజరాత్ మత ఘర్షణలపై నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ చేసిన డాక్యుమెంటరీ కలకలం రేపింది. ఈ డాక్యుమెంటరీని కళాశాలల్లో ప్రదర్శించడం వివాదం కావడమే కాకుండా, న్యాయస్థానాలు కూడా దీనిపై విచారణ జరిపాయి. ఇదే కాకుండా నిషేధిత పీఎస్ఎఫ్ ఇక్కడ తన కార్యకలాపాలను చురుకుగా నిర్వహించింది. అందుకు సంబంధించిన కీలక విద్యార్థినేత అయిన కే ఎస్ రామదాస్ ను రెండు సంవత్సరాలు కళాశాల నుంచి సస్పెండ్ కూడా చేశారు.
విద్యార్థుల మీద ఒత్తిడి పెట్టడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే: మేధా పాట్కర్
చట్ట వ్యతిరేక, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడనే అభియోగంతో టిస్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ సస్పెన్షన్ నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కేంద్ర విద్యాశాఖతో ఎంఓయూ కుదిరిన తరువాత, టిస్ కేంద్ర విద్యాశాఖ పరిధిలోకి వెళ్తుంది. కొన్ని అభిప్రాయాల ప్రకారం, హానర్ కోడ్ ద్వారా విద్యార్థుల స్వేచ్ఛను పరిమితం చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం కాబట్టి, విద్యార్థులు దీనిని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రముఖ హక్కుల కార్యకర్త మేధా పాట్కర్ కూడా విద్యార్థుల మీద ఒత్తిడి పెట్టడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం అంటున్నారు.
నిబంధనలపై విద్యార్థుల అభ్యంతరం
కాగా, కొన్ని ప్రభుత్వ కళాశాలలలో విద్యార్థులు ఈ విధమైన నిబంధనలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారు, కళాశాలలు కేవలం విద్యా కేంద్రాలుగా కాకుండా, రాజకీయ పునరావాసాలుగా మారుతున్నాయని, విద్యార్థుల ఏకాగ్రతకు ముప్పుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.