
Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థి సస్పెండ్ ముంబై(Mumbai)లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్ )(Tiss)ఓ పరిశోధక విద్యార్థిని సస్పెండ్ చేసింది.
దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడన్న కారణంతో రెండేళ్లపాటు తమ విద్యా సంస్థ నుంచి విద్యార్థిని సస్పెండ్ చేసింది.
ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్ లలో కూడా ప్రవేశించకూడదని తీర్మానించింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
కేరళకు చెందిన రామాదాస్ ప్రినిశివనందన్ (30) డెవలప్ మెంట్ స్టడీస్ లో డాక్టరేట్ చేస్తున్నాడు.
ఈ ఏడాది జనవరి 26 న రామ్ కే నామ్ అనే డాక్యుమెంటరీని క్యాంపస్ లో ప్రదర్శించిన ఘటనలో ప్రినిశివనందన్ జోక్యం ఉందని తేలుస్తూ మార్చి 7 అతడికి నోటీసు పంపించారు.
Tiss-Student Suspended
ఆందోళనలో పాల్గొన్నాడని సస్పెండ్ చేశారు
అదేవిధంగా జనవరి 26న అయోధ్య లో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామ మందిరాన్ని అగౌరవ పరచడమే కాకుండా ఆందోళన కూడా నిర్వహించాడు.
ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్ ఫోరమ్ వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు.
ఆ ఆందోళనలో పీఎస్ ఎఫ్ -టిస్ బ్యానర్ ప్రదర్శిస్తూ కనిపించాడు.
ఇలా కనిపించడం సంస్థ పేరును దుర్వినియోగపరచడమేనని పేర్కొంటూ టిస్ విద్యా సంస్థ అతడికి నోటీసులు పంపింది.
ఈ ఘటనతో పాటు ప్రభుత్వం నిషేధం విధించిన బీబీసీ డాక్యుమెంటరీని ఈ ఏడాది జనవరి 26న ప్రదర్శించడంలో ప్రినిశివనందన్ పాత్ర కూడా ఉందని నోటీసులో పేర్కొన్నారు.
దీంతోపాటు భగత్ సింగ్ మెమోరియల్ లెక్చర్ కోసం వివాదాస్పద వ్యక్తిని స్పీకర్ గా ప్రినిశివనందన్ పిలిచారని కూడా అందులో పేర్కొన్నారు.
Tiss-Mumbai
దేశ విద్రోహ చర్యల్ని టిస్ ఎప్పటికీ సహించదు
ప్రజా సంస్థగా పేరొందిన టిస్ ఇటువంటి చర్యల్ని ఎప్పటికీ సహించదని, దేశ విద్రోహ కార్యకలాపాలు తమ సంస్థకు చెడ్డపేరును తెస్తాయని పేర్కొంది.
ప్రినిశినందన్ చేసిన చర్యలన్నీ తీవ్రమైన నేరాలనే నని కూడా అందులో వెల్లడించారు.
వ్యక్తిగత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఇటువంటి చర్యలకు దురుద్దేశపూర్వకంగానే పాల్పడినట్లు నోటీసులో పేర్కొన్నారు.
ఈ మేరకు టిస్ క్యాంపస్ డిసిప్లనరీ కమిటీ ఇతడిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా సిఫారసు చేసింది.
రెండేళ్ల పాటు ఈ సస్పెండ్ కొనసాగుతుందని, దేశంలో ఉన్న ఏ టిస్ క్యాంపస్ లోకైనా ఇతడి ప్రవేశం పట్ల నిషేధం విధించింది.
తన సస్పెన్షన్ ను ఇంటర్నల్ అథారిటీ ముందు అప్పీల్ చేస్తానని ప్రినిశివనందన్ తెలిపాడు.