దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అదృశ్యమయ్యారని సోమవారం సాయంత్రం నుంచి ఆయన జాడ తెలియలేదని అతని కుమారుడు సుభార్గుషు రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.అయితే ముకుల్ రాయ్ మంగళవారం దిల్లీలో ప్రత్యేక్షం కావడంతో ఉత్కంఠ వీడింది. సుభార్గుషు రాయ్‌తో ఆదివారం ముకుల్ రాయ్ గొడవ జరిగినట్లు బయటకు రావడం, అలాగే కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం వల్ల సోమవారం సాయంత్ర నుంచి ముకుల్ రాయ్ మిస్సింగ్‌పై అనేక ఊహాగానాలు వినిపించాయి.
నేను ఇక్కడికి రావొద్దా: ముకుల్ రాయ్
ముకుల్ రాయ్ మంగళవారం దిల్లీలో ప్రత్యేక్షం కావడంతో విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో స్పందించిన ముకుల్ తనకు దిల్లీలో పని ఉందని, తాను ఇక్కడికి రావొద్దా అని ప్రశ్నించారు. అస్వస్థతగా ఉందా? అని విలేఖరి ప్రశ్నించగా, అదేం లేదని, ప్రత్యేక పని మీద ఇక్కడికి వచ్చినట్లు రాయ్ చెప్పారు. అయితే 2021లో బీజేపీ నుంచి తృణమూల్‌లోకి చేరిన ముకుల్ దిల్లీ పర్యటనపై పలు అనుమానాలను విలేకరులు వ్యక్తం చేయగా, తాను ప్రత్యేక రాజకీయ కారణాల కోసం ఇక్కడికి రాలేదని ఖరాఖండిగా చెప్పేశారు.