
Mahua Moitra : లోక్ సభ నుంచి బహిష్కరణ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా
ఈ వార్తాకథనం ఏంటి
టీఎంసీ నేత మహువా మెయిత్రా(Mahua Moitra) లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
దీనికి నిరసనగా ఆమె తనను లోక్ సభ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్ చేశారు.
ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
ఆధారాల్లేకుండా, తనపై వచ్చిన ఆరోపణలపై సరైన దర్యాప్తు చేయకుండానే తనపై చర్యలు తీసుకున్నారని మహువా మెయిత్రా వాపోయింది.
దీనిపై విచారణ చేపట్టాలని ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే.
Details
వాకౌట్ చేసిన పార్లమెంట్ సభ్యులు
ఆదానీ గ్రూప్ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులను మహువా తీసుకుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు.
దీనిపై ఆయన లోక్ సభ స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో హీరానందానీ అప్రూవర్‌గా మారి, ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపార వేత్త దర్శన్ హీరానందనీ ఆరోపించారు.
సస్పెన్షన్ కు ముందు వరకు ఆమె పశ్చిమబెంగాల్ లోని కృష్ణా నగర్ ఎంపీగా ఉన్నారు.
మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశారు.