
CRDA: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం..
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరగనుంది.
ఈ భేటీలో మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్‌తో పాటు సీఆర్‌డీఏ కమిషనర్,ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు.
ఈ సమావేశంలో రాజధాని పరిధిలో ఇంకా చేపట్టాల్సిన కొన్ని కీలక పనులకు అనుమతిని ఇవ్వనుందని అంచనా.
ఇప్పటి వరకు రూ.49,154 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
తాజాగా రూ.15,757 కోట్ల పనులకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది.
ఫలితంగా, అమరావతి రాజధానిలో మొత్తం రూ.64,912 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే సమావేశం ఎంతో కీలకంగా మారనుంది .
వివరాలు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు సమావేశం
ఇదిలా ఉండగా, అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
సభ నిర్వహణ బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా శాసనబద్ధంగా ఏర్పాట్లు చేసినందుకు సీఎం అధికారులను ప్రశంసించారు.
ముందుగా ఈ తరహాలోనే సమన్వయంతో పని చేయాలని, ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సమన్వయం కోసం వివిధ స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం, విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను నిర్వహించడం వంటి చర్యల వల్ల సభ అంతా విజయవంతంగా సాగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.