Page Loader
Byju's- BCCI: బైజూస్- బీసీసీఐ వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు
బైజూస్- బీసీసీఐ వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు

Byju's- BCCI: బైజూస్- బీసీసీఐ వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2024
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐతో జరుగుతున్న సెటిల్మెంట్‌ కేసులో బైజూస్‌కు కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. ఇటీవల జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) రూ.158.9 కోట్ల సెటిల్మెంట్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఈ మొత్తం సొమ్మును క్రెడిటార్స్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేయాలని పేర్కొంది. గతంలో తీర్పునిచ్చే సమయంలో ఎన్‌సీఎల్‌టీ తన బుర్రను ఏమాత్రం వాడకుండా బైజూస్‌ దివాలా పిటిషన్‌ను ముగించిందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలను విడుదల చేసింది.

వివరాలు 

బైజూ రవీంద్రన్‌ చేతికి పగ్గాలు

బీసీసీఐకి రూ.158.9 కోట్ల బకాయిల సెటిల్‌మెంట్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఈనెల 2న ఆమోదించిందని, ఈ సమయంలో బైజూస్‌పై దివాలా ప్రొసీడింగ్స్‌ను పక్కన పెట్టాలని ఆదేశించింది. ఇది బైజూస్‌కు ఓ ఊరటగా నిలిచింది. కంపెనీ అధిపతి బైజూ రవీంద్రన్‌ చేతికి పగ్గాలు అందించేందుకు మార్గం సుగమం చేసింది. అయితే ఇది ఎంతోకాలం నిలబడలేదు. అమెరికాకు చెందిన గ్లాస్‌ ట్రస్ట్‌ కంపెనీ ఇప్పటికే ఈ ఎడ్‌టెక్‌ సంస్థకు రుణదాతగా ఉన్నది, ఆ కంపెనీ ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 14న ఈ తీర్పుపై స్టేను మంజూరుచేసింది. తాజా సమాచారమినుసరంగా, బీసీసీఐ ఆ సొమ్మును రుణదాతల కమిటీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

వివరాలు 

రుణదాతలు తనతో కొనసాగేందుకు సిద్ధమైతే..

మరోవైపు, రుణదాతలు తనతో కొనసాగేందుకు సిద్ధమైతే,వారికి మొత్తం అప్పును తిరిగి చెల్లిస్తానని బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ కొన్నాళ్ల క్రితం వెల్లడించారు. 'బైజూస్‌పై దివాలా ప్రక్రియ కొనసాగితే రుణదాతలకు ఎటువంటి డబ్బు అందదు.ఒకవేళ వారు నాతో కలిసి పనిచేస్తే,నేను కంపెనీ నుంచి ఒక్క రూపాయి తీసుకోవడానికి ముందు వారి బకాయిలు చెల్లిస్తాను. మేము 140 మిలియన్‌ డాలర్లు చెల్లించినా, మొత్తం రుణం 1.2 బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని వారు అంటున్నారు. ఇప్పటికే వాటిని పెట్టుబడులుగా పెట్టాం. చాలామంది సెటిల్‌మెంట్‌ కావాలంటున్నారు, కానీ కొందరు ఒప్పుకోవట్లేదు' అని అన్నారు.

వివరాలు 

1.2 బిలియన్‌ డాలర్ల టర్మ్‌ లోన్‌

సంస్థాగత మదుపర్ల నుంచి 1.2 బిలియన్‌ డాలర్ల టర్మ్‌ లోన్‌ (టీఎల్‌బీ)ను బైజూస్‌ సమీకరించింది. అమెరికాకు చెందిన ఈ రుణదాతలు 1.35 బిలియన్‌ డాలర్ల బకాయిలు కట్టాలని భారత కోర్టుల్లో కేసులు వేసారు. తాజా సమాచారం ప్రకారం, ఈ బకాయిలను 1.5 బిలియన్‌ డాలర్లుగా పేర్కొనడం బైజూస్‌కు తలనొప్పిగా మారింది.