LOADING...
Siddaramaiah: సీఎం కారుపై ట్రాఫిక్‌ చలానాలు.. 50% డిస్కౌంట్‌తో జరిమానా క్లియర్‌!
సీఎం కారుపై ట్రాఫిక్‌ చలానాలు.. 50% డిస్కౌంట్‌తో జరిమానా క్లియర్‌!

Siddaramaiah: సీఎం కారుపై ట్రాఫిక్‌ చలానాలు.. 50% డిస్కౌంట్‌తో జరిమానా క్లియర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్‌ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాహనదారులకు ఊరట కలిగించిన ఈ పథకం కిందే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన కారుకు పడిన జరిమానాలను చెల్లించారు. సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై మొత్తం 7 ఉల్లంఘనలు నమోదయ్యాయి. అందులో సీటు బెల్ట్ ధరించకపోవడం ఆరు సార్లు, అలాగే అతివేగం కారణంగా ఒకసారి చలానా పడింది.

Details

సెప్టెంబర్ 19 వరకు అమల్లో

అయితే జరిమానా ఉన్నా చెల్లించలేదన్న విమర్శలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తరించాయి. దీనితో సీఎం యంత్రాంగం డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగించి రూ.8,750 చెల్లించింది. ప్రభుత్వం ఈ పథకం కింద వాహనదారులు జరిమానాలో సగం మొత్తాన్ని చెల్లిస్తే, మిగతావి మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ స్కీమ్ సెప్టెంబర్ 19 వరకు అమల్లో ఉండనుంది. రాయితీ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.