LOADING...
Train Derailment in Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు.. దెబ్బతిన్న మూడు బోగీలు
ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు.. దెబ్బతిన్న మూడు బోగీలు

Train Derailment in Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు.. దెబ్బతిన్న మూడు బోగీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కాలంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం, ట్రైన్లలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. టెక్నికల్ లోపాలు, మానవ తప్పిదాల కారణంగా ఈ రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్ వైపు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటన నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

Details

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు

ప్రమాదంలో మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న తూర్పు కోస్తా రైల్వే అధికారులు, సంబల్పూర్ డీఆర్ఎం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అదేవిధంగా, దెబ్బతిన్న బోగీలను ట్రాక్ నుంచి తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వీడియో వైరల్