UTS: అరచేతిలోనే రైలు టికెట్! యూటీఎస్ యాప్‌తో కౌంటర్ క్యూలకు గుడ్‌బై
ఈ వార్తాకథనం ఏంటి
రైలులో ప్రయాణించేందుకు ఇక స్టేషన్ కౌంటర్ వద్ద పొడవైన క్యూ ల్లో నిలబడాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుందని, యూటీఎస్ (UTS) యాప్ ద్వారా ప్రయాణికులు అనేక సేవలను సులభంగా పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్‌లో టికెట్ ప్రింట్ చేయడం, ప్రింట్‌లెస్ టికెట్‌తో ప్రయాణించడం వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Details
ఎలా ఉపయోగించాలి?
ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూటీఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి ఖాతాను యాక్టివేట్ చేయాలి. రైలులో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారో ఎంటర్ చేసిన వెంటనే టికెట్ ధరను యాప్ సూచిస్తుంది. యాప్‌లోని ఆర్-వాలెట్ (R-Wallet) లో ముందుగానే నగదు జమ చేసుకుని టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. గమనికగా, యాప్‌లో టికెట్ బుక్ చేయాలంటే రైలు పట్టాలు లేదా రైల్వే స్టేషన్ ప్రాంతానికి కనీసం 20 మీటర్ల దూరం ఉండాలి. ఈ యాప్ ద్వారా రిజర్వేషన్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు, సీజన్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. అవసరం లేకపోతే టికెట్ బుకింగ్‌ను రద్దు (క్యాన్సిల్) చేసే అవకాశం కూడా ఉంది.