
IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎనిమిది మందికి పోస్టింగ్ మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోదియాను చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
మరోవైపు, సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కార్యదర్శి భాస్కర్ కాటమనేనాకు ఏపీ హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Details
ఆయుష్ డైరెక్టర్‌గా దినేష్ కుమార్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా ముత్యాలరాజును నియమించారు.
ఇక రైతు బజార్ల సీఈవోగా కె. మాధవీలత, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని నియమించారు.
ఆయుష్ డైరెక్టర్‌గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.