Page Loader
Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!
గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!

Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల ప్రజలుగా బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ మార్గంలో బీబీనగర్ - గుంటూరు మధ్య 239 కి.మీ ఉండేది. రెండో లైను నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ ఈ డబ్లింగ్ పనులకూ శంకుస్థాపన చేశారు. ఈ రైల్వే మార్గం ద్వారా మొత్తం నిర్మాణ వ్యయం రూ.2853.23 కోట్లు అవుతుందని, ఇందులో సిగ్నలింగ్, టెలికాం పనులకు రూ.319.62 కోట్లు, సివిల్ పనులకు రూ.1947.44 కోట్లు, ఎలక్రికల్ ఇంజనీరింగ్ పనులకు రూ.586.17 కోట్లు అంచనా వేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ - విజయవాడ మధ్య రెండు రైల్వే మార్గాలున్నాయి.

Details

46కి.మీ తగ్గే అవకాశం

అందులో ఒకటి ఖాజీపేట-ఖమ్మం మార్గం, మరొకటి బీబీనగర్ - నడికుడి - గుంటూరు మార్గం. ఇది ప్రస్తుతం సింగిల్ లైన్ ఉండడంతో రైలు ఒకదాని వెనుక మరో రైలు వస్తున్నప్పుడు వేచి ఉండాల్సి వస్తుంది. రెండో లైను నిర్మాణం పూర్తయితే రైళ్ల వేగం పెరగడమే కాకుండా అదనపు రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో 139 కిలోమీటర్లు తెలంగాణలో, 100 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. ప్రస్తుతం సింగిల్ లైను గరిష్ట వేగం 130 కిలోమీటర్లు కాగా, వందేభారత్ రైలు వేగం 160 కిలోమీటర్లు. కొత్తగా చేపట్టే రెండో లైను వేగ సామర్థ్యం 150-160 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ డబ్లింగ్ మార్గంతో, సికింద్రాబాద్ నుండి తిరుపతి, చెన్నైలకు దూరం 46 కి.మీ. తగ్గుతుంది.

Details

తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రయోజనం

సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో ప్రస్తుతం 350 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ బీబీనగర్ - నడికుడి - గుంటూరు మార్గం 336 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గం అత్యంత రద్దీగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఈ మార్గం సామర్థ్య వినియోగం 148.25% ఉంటుంది. ఈ డబ్లింగ్ మార్గం తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి, సిమెంట్, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుంది. ఈ మార్గాలలో జగ్గయ్యపేట, నడికుడి, మేళ్లచెరువు, విష్ణుపురం, జాన్ పహాడ్ ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమలు ఉండడం విశేషం.