LOADING...
PM Modi Birthday: టెలిఫోన్‌లో ట్రంప్-మోదీ సంభాషణ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
టెలిఫోన్‌లో ట్రంప్-మోదీ సంభాషణ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు

PM Modi Birthday: టెలిఫోన్‌లో ట్రంప్-మోదీ సంభాషణ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్, మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించిన ట్రంప్, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాగే భారతదేశం-అమెరికా సంబంధాలు, ప్రపంచ స్థాయి సమస్యలపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఈ చర్యను భారత-అమెరికా సంబంధాలను మరింత బలపరిచే దిశగా వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తరువాత అధ్యక్షుడు ట్రంప్ తన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ సంభాషణ జరిగింది.

Details

నరేంద్ర మోదీ పనితీరుపై ప్రశంసలు

ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి మీరు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలని ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రధాని మోదీ కూడా దీనికి ప్రతిస్పందిస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. "నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు. మీ ఫోన్ కాల్, పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీలాగే నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాను. అలాగే ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేస్తున్న కృషికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామని మోదీ పేర్కొన్నారు.