Page Loader
Modi-Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్
ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్

Modi-Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు రానున్న అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. వచ్చే నెలలో, ఆయన మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం ట్రంప్‌, మోదీ ఫోన్లో మాట్లాడుకున్నారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు ట్రంప్‌ స్పందించారు. భారత్‌తో అనుబంధం బలంగా ఉందని, బహుశా వచ్చే నెలలో, భారత ప్రధాని వైట్‌హౌస్‌కు వస్తారని తెలిపారు. ఈ చర్చలో అక్రమ వలసదారుల అంశం కూడా ప్రస్తావించారు. అక్రమంగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ సరైన నిర్ణయం తీసుకుంటుందని తాను అశిస్తున్నానని ట్రంప్‌ పేర్కొన్నారు.

Details

భారత్-అమెరికా సంబంధాలు పటిష్టం

ప్రస్తుతానికి 2020లో ట్రంప్‌ తన మొదటి విదేశీ పర్యటన భారతదేశంలో నిర్వహించారు. అహ్మదాబాద్‌లో మోదీతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు 2019లో, వీరిద్దరూ హ్యూస్టన్‌లోని ర్యాలీలో ప్రసంగించారు. ఇటీవల, ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ నిన్న ఫోన్‌లో మాట్లాడారు. ఈ చర్చలో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, పరస్పర ప్రయోజనాల అంశాలపై వారు చర్చించారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని వారు తెలిపారు.