LOADING...
Trump Tariff Row: రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్‌ 
రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్‌

Trump Tariff Row: రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
07:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ పరిస్థితులపై తాజా సమాచారం పుతిన్ ప్రధాని మోదీకి అందించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని భారత్ తన వైఖరిని మరలా స్పష్టం చేసిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించారు.

వివరాలు 

పుతిన్‌ను భారత్ కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానం 

ఈ ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు తమ నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో భాగంగా ఈ ఏడాది చివరలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను భారతదేశంలో పర్యటించాలని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు పీఎంవో వెల్లడించింది. అయితే, రష్యా నుండి చమురు కొనుగోలు నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలు ఉన్న సమయంలో, ప్రధాని మోదీ పుతిన్‌తో మాట్లాడటం విశేష ప్రాముఖ్యత పొందింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్