TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలతో దర్శనానికి కొత్త నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను శ్రీవారి దర్శనాన్ని టీటీడీ అందించనుంది.
ఈ కొత్త విధానం మార్చి 24 నుండి అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి, తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆదివారం, సోమవారం మాత్రమే స్వీకరించనున్నారు.
అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి బుధ, గురువారాల్లో మాత్రమే సిఫార్సు లేఖలను అంగీకరించనున్నారు.
ప్రతి సిఫార్సు లేఖ ద్వారా గరిష్ఠంగా ఆరుగురికే అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.
Details
మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలి
ఇప్పటివరకు, సోమవారం విఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరించే సిఫార్సు లేఖలు ఇకపై శనివారం (ఆదివారం దర్శనం కోసం) కూడా స్వీకరించనున్నారు.
తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి, ఇతర భక్తుల దర్శన సమయాలను పరిగణలోకి తీసుకుని, సుదీర్ఘంగా చర్చించిన అనంతరం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
భక్తులు ఈ మార్పులను గమనించి, టీటీడీకి సహకరించాలని కోరారు.