Page Loader
ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు
ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు

ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు

వ్రాసిన వారు Stalin
Apr 21, 2023
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ అమలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు బ్లూ మార్క్‌ను కోల్పోయారు. ఆ జాబితాలో భారతదేశంలోని ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు ఉండటం గమనార్హం. సబ్‌స్క్రిప్షన్ తీసుకొని వినియోగదారుల 'బ్లూ టిక్' బ్యాడ్జిని గురువారం ట్విట్టర్ తొలగించింది. ట్విట్టర్ 'బ్లూ టిక్' వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను కోల్పోయిన ప్రముఖ పేర్లలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ట్విట్టర్ మార్క్‌ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

ట్విట్టర్

రాజకీయ పార్టీల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్‌కు కూడా మస్క్ షాక్

అంతేకాదు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా వాటి బ్లూ టిక్‌‌ బ్యాడ్జ్‌లను కోల్పోవల్సి వచ్చింది. ట్విట్టర్ 'బ్లూ టిక్' కోసం వెబ్‌లో అయితే నెలకు దాదాపు రూ.650, మొబైల్ యాప్‌లో అయితే రూ.900 ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్‌ను ఎలోన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో గతంలో ప్రముఖులకు మాత్రమే గౌరవప్రదంగా ఇచ్చే 'బ్లూ టిక్'ను సబ్‌స్క్రిప్షన్ పరిధిలోకి తెచ్చారు. సబ్‌స్క్రిప్షన్ తీసుకొని 'బ్లూ టిక్' పొందాలని నిబంధన విధించారు. వినియోగదారులను ప్రోత్సహించేందుకే ఈ సబ్‌స్క్రిప్షన్ ను తీసుకొచ్చినట్లు మస్క్ పేర్కొన్నారు.