Page Loader
ఉదయనిధి తలకు రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించిన అయోధ్య స్వామిజీ 
ఉదయనిధి తలకు రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించిన అయోధ్య స్వామిజీ

ఉదయనిధి తలకు రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించిన అయోధ్య స్వామిజీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2023
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వ్యక్తికి రూ.10 కోట్ల రివార్డు ఇస్తామని అయోధ్య సీయర్ పరమహంస ఆచార్య సోమవారం ప్రకటించారు. స్వామి పరమహంస ఆచార్య ఒక చేతిలో ఉదయానిధి ఫోటో,మరో చేతిలో తలను నరుకుతున్నవీడియో చూపించి ఈ పని మీరు త్వరగా చెయ్యండి,రూ. 10 కోట్లు ఇస్తాను అని చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్వామిజి రివార్డ్ పై ఉదయానిధి స్టాలిన్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ స్వామిజీ తన తల నరికితే రూ.10 కోట్లుఇస్తానని ప్రకటించడం చూస్తే..ఆయన నిజంగా సాధువా,లేక డూప్లికేట్ స్వామీజీనా ? ఇన్ని డబ్బులు స్వామీజీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయ్ అంటూ ప్రశ్నించారు.

Details 

ఎన్ని కేసులు పెట్టినా భయపడను: ఉదయనిధి 

ఆ పది కోట్ల బదులు తనకి 10 రూపాయల దువ్వెన ఇస్తే తనే తల చక్కగా దువ్వుకుంటాను కదా అంటూ ఉదయానిధి వ్యంగంగా అన్నారు. సనాతన ధర్మం'పై వివాదాస్పద వ్యాఖ్యలతో పతాక శీర్షికల్లో నిలుస్తున్న స్టాలిన్ తన వ్యాఖ్యలను మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తానని ప్రకటించారు. అంతటితో ఆగని ఉదయనిధి తనపై ఎన్ని కేసులు నమోదైన భయపడనని తన అన్న మాటలకు కట్టుబడి ఉంటానని తేల్చిచెప్పారు. తాను హిందూ సమాజాన్ని టార్గెట్ చెయ్యలేదని, తాను కేవలం సనాతన ధర్మాన్ని మాత్రం వ్యతిరేకించానని ఉదయనిధి చెప్పడం కొసమెరుపు.