Jharkhand Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి
జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాంచీలో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని మార్చే అవకాశమే కాదు, జార్ఖండ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎన్నికలుగా ఆయన పేర్కొన్నారు. ఉపాధి కల్పించే ఆశతో యువత బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిపారు. "హేమంత్ సోరెన్ వంటి నాయకుల కంటే, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం కృషి చేస్తోంది" అని అమిత్ షా చెప్పారు. ఆయన మాట్లాడుతూ, "సోరెన్ పాలనలో మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్తు కోసం చాలా కీలకమైనవి" అని పేర్కొన్నారు.
దుష్పరిపాలన ,అవినీతిని అంతం: అమిత్ షా
అయితే, అక్రమ వలసలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే, వలసదారులు ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, "మేము దుష్పరిపాలన ,అవినీతిని అంతం చేస్తామని" హామీ ఇచ్చారు. "బీజేపీ చేసిన ప్రతీ మాట నిజమే, మేము మట్టిని, కూతుళ్లను, రొట్టెలను కాపాడుతాం" అని ఆయన స్పష్టం చేశారు. "మా తీర్మానాలను నెరవేర్చే నమ్మకం మా నికటంలో ఉంది, అధికారంలోకి రాగానే జార్ఖండ్ అభివృద్ధికి కృషి చేస్తాం" అని అమిత్ షా తెలిపారు.
జార్ఖండ్‌కు 3 లక్షల 8 వేల కోట్లు
ఇక్కడి అవినీతిని ఎదుర్కొనేందుకు మేము కృషి చేస్తామని, "హేమంత్ సోరెన్ ప్రధాని మోడీ నుండి లక్ష కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మీరు ధైర్యం ఉంటే, జార్ఖండ్ ప్రజలకు సమాధానం ఇవ్వండి" అని ఆయన అన్నారు. 2004 - 2014 మధ్య జార్ఖండ్‌కు 84 వేల కోట్లు అందించామని, "ప్రధాని మోడీ 2014 - 2024 మధ్య జార్ఖండ్‌కు 3 లక్షల 8 వేల కోట్లు అందించిన విషయం మనకు తెలిసిందే" అని అన్నారు.