
Raja Singh: రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం రాజా సింగ్ రాజీనామాను ఆమోదించామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఆయన వెల్లడించిన ప్రకారం, ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తికి లోనైన రాజా సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా లేఖ అందజేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తనకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే కారణంతో పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హై కమాండ్
Union Minister and BJP national president JP Nadda accepts the resignation of Telangana MLA T Raja Singh from the party with immediate effect. pic.twitter.com/CJIAKvhQrk
— ANI (@ANI) July 11, 2025