
యూపీ పోలీస్ మాస్టర్ ప్లాన్.. బైక్‌లో రహస్యంగా తుపాకి పెట్టి.. అక్రమ ఆయుధం దొరికిందని అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్ స్థానిక పోలీసు అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చెయ్యడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.
ఏకంగా ఆ వ్యక్తి బైక్‌లో రహస్యంగా తుపాకిని పెట్టే.. అంతరం తనిఖీ నిర్వహించి గన్ దొరికిందని అతడిని అరెస్ట్ చేశారు.
పోలీస్ అతడి బైక్‌లో తుపాకి పెడుతున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అసలు విషయంలోకి వెళితే.. భూవివాదం కేసులో ఇరుక్కున్న అశోక్ త్యాగి,రాఖీ దంపతుల కుమారుడు అంకిత్‌ను పోలీసులు సెప్టెంబర్ 26, మంగళవారం అరెస్టు చేశారు.త్యాగి బయటపెట్టిన సిసిటివి వీడియోలో పోలీసు అధికారుల బృందం ఇంట్లోకి ప్రవేశించి బయట పార్క్ చేసిన మోటారు సైకిల్‌లో పోలీసు ఓ తుపాకి పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.
Details
సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు
అనంతరం, వేరే పోలీసు అధికారులు వచ్చి మోటారుసైకిల్ నుండి పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని అంకిత్‌ను అరెస్ట్ చేశారు.
రాఖీ త్యాగి బైక్ తన భర్త అశోక్‌కు చెందినదని పేర్కొంది. పోలీసులు భూ వివాదంలో ప్రమేయం ఉన్న తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి వారి కోరిక మేరకు పిస్టల్‌ను అమర్చారని ఆరోపించారు.
సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Details
అదుపులో ఇద్దరు కానిస్టేబుళ్లు
మీరట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేహత్ కమలేష్ బహదూర్ సంఘటనపై సమగ్ర విచారణకు హామీ ఇచ్చారు.
ఏదైనా తప్పు జరిగితే చట్టపరంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
మోటారు సైకిల్‌లో పిస్టల్ ఉంచినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలకు వెళ్లారని తెలిపారు.
వైరల్ అయిన వీడియో గురించి తనకు తెలుసునని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని బహదూర్ చెప్పారు.
ఘటనలో పాల్గొన్న ఇద్దరు కానిస్టేబుళ్లను గుర్తించి ప్రశ్నిస్తున్నారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.