Page Loader
యూపీలో అమానుషం.. లెక్కలు చేయలేదని ముస్లిం విద్యార్థిపై చెంప దెబ్బ కొట్టించిన టీచర్
ముస్లిం విద్యార్థిని చెంప దెబ్బ కొట్టించిన మహిళా టీచర్

యూపీలో అమానుషం.. లెక్కలు చేయలేదని ముస్లిం విద్యార్థిపై చెంప దెబ్బ కొట్టించిన టీచర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 26, 2023
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అమానుషం జరిగింది. తరగతి గదిలో ఓ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో టీచర్ కొట్టించిన సంఘటన కలకలం రేపింది. ముజఫ్ఫర్‌నగర్‌లోని స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మ అమానుషంగా ప్రవర్తించింది. బడి పిల్లల మనసుల్లో మత విద్వేషాలను సృష్టించింది. వీడియో ఆధారంగా మహిళా టీచర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులు విద్యాశాఖను కోరారు. ఆ ముస్లిం విద్యార్థి మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని, దీంతో తోటి విద్యార్థులతో బాలుడ్ని చెంప దెబ్బలు కొట్టించిందన్నారు. అటు బాలల హక్కుల సంఘం ఉపాధ్యాయురాలిపై చర్యలకు డిమాండ్ చేసింది. స్కూల్ యాజమాన్యం తమతో రాజీ చేసుకుందని, ఫీజు తిరిగి చెల్లించిందని బాధిత తండ్రి తెలిపారు.తమ బిడ్డను ఇకపై ఆ స్కూలుకు పంపబోమని,గొడవను ఇక్కడితో వదిలేయాలని కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహిళా టీచర్ పై చర్యలు కోరుతున్న నెటిజన్లు