Page Loader
Uttarakhand Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు
ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు

Uttarakhand Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సీ) తెలిపింది. భూకంపం సమయంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రకంపనలు సోమవారం ఉదయం 8.35 గంటలకు 5 కి.మీ లోతులో వచ్చినట్లు ఎన్‌ఎస్‌సీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వివరించారు. గత వారం ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.8, 2.1 తీవ్రతలతో స్వల్ప భూకంపాలు సంభవించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్వల్ప ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు