
ఉత్తరాఖండ్ : టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలిపోయింది. ఫలితంగా అందులోని 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
ఈ క్రమంలో సొరంగం రాళ్లు కార్మికుల మీద పడటంతో అందులో ఇరుక్కుపోయారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నా సొరంగం రాళ్లు మీద పడే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో సొరంగంలో చిక్కుకున్న వారికి ఓ పైపు ద్వారా ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు.
ఉత్తరకాశీ జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై సిక్యారా-దండల్గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న ఉన్న ఓ సొరంగం కూలిపోయింది.
ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రామనికి సమాచారం అందించింది.తక్షణమే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యల్లో నిమగ్నమైంది.
Details
మరో 35 మీటర్లు వెళ్లాల్సి ఉంది : పోలీసులు
సొరంగంలో చిక్కుకుపోయిన వారికి ఆక్సిజన్ సహా ఆహారం పైపులైన్ లో పంపిస్తున్నారు.
ఇదే సమయంలో సొరంగంలోకి 15 మీటర్ల మేర ప్రవేశించామని, మరో 35 మీటర్లు వెళ్లాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం సొరంగంలో ఉన్న వారంతా సురక్షితంగానే ఉన్నారన్న పోలీసులు, సొరంగంలోకి ప్రవేశించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.
ఘటనపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఈ క్రమంలోనే సొంరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉత్తరాఖండ్ కు అన్నివిధాలా సహాయ సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సహా పోలీసులు, స్ధానిక ప్రభుత్వ అధికారులు సహాయక చర్యల్లో భాగమయ్యారు.
ఆపరేషన్‌లో 13 మీటర్ల వెడల్పు సొరంగం లోపల చెత్తను తొలగించేందుకు రెండు జేసీబీలు, ఓ పోక్లెయిన్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.