Vallabhaneni Vamsi: వంశీకి షాకిచ్చిన కోర్టు.. మూడు రోజుల పాటు కస్టడీకి కోర్టు నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాజకీయాల్లో ఒక రేంజ్ లో హవా కొనసాగించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాల్లో భాగంగా, ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఏ71 నిందితుడిగా పోలీసులు వంశీని చేర్చారు.
ఆ తర్వాత ఫిర్యాదు దారు సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో రిమాండ్ గడువు ముగిసేలోపే మరో ఎదురు దెబ్బ తగిలింది.
గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఫిర్యాదు దారైన సత్యవర్ధన్‌ను బెదిరించి, కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంపై ఇప్పటికే పోలీసులు వంశీని అరెస్టు చేసి,రెండు వారాల రిమాండ్‌పై విజయవాడ సబ్ జైలుకు పంపించారు.
వివరాలు
సీఐడీ వంశీకి మరో షాక్
ఈ రిమాండ్ గడువు రేపటితో ముగియనున్ననేపథ్యంలో,ఆయనకు హైకోర్టు కూడా బెయిల్ తిరస్కరించింది.
దీంతో మరోసారి రిమాండ్ పొడిగింపునకు కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదే సమయంలో,సీఐడీ వంశీకి మరో షాక్ ఇచ్చింది.
గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో వంశీని విచారించేందుకు అనుమతిని కోరుతూ స్థానిక కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది.
వివరాలు
అదనపు సదుపాయాల కోసం వంశీ వేసిన పిటిషన్‌పై కోర్టు నిర్ణయం పెండింగ్
కోర్టు దీనిపై విచారణ జరిపి, పీటీ వారెంట్ ద్వారా వంశీని హాజరుపర్చేందుకు అనుమతి మంజూరు చేసింది.
దీంతో రిమాండ్ గడువు పూర్తయ్యాక, సీఐడీ వంశీని సబ్ జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లనుంది.
ఈ పరిణామాల వల్ల వంశీకి రెండు కేసుల్లోనూ విచారణ తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇదే సమయంలో, జైల్లో అదనపు సదుపాయాల కోసం వంశీ వేసిన పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఇంకాపెండింగ్ లో ఉంది.
మరో కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం రావడంతో, వంశీ తదుపరి చర్యలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.