Page Loader
పెళ్లిపీటలు ఎక్కనున్న వంగవీటి రాధా.. ఈనెల 19న నిశ్చితార్థం 
పెళ్లిపీటలు ఎక్కనున్న వంగవీటి రాధా.. ఈనెల 19న నిశ్చితార్థం

పెళ్లిపీటలు ఎక్కనున్న వంగవీటి రాధా.. ఈనెల 19న నిశ్చితార్థం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 16, 2023
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. దివంగత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పట్టణానికి చెందిన పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైందని కుటుంబీకులు తెలిపారు. నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాని, బాబ్జీల చిన్న కుమార్తె పుష్పవల్లి. ఆగస్ట్ 19న నర్సాపురంలో నిశ్చితార్థం జరగనుంది. ఈ మేరకు వధువు పుష్పవల్లి తండ్రి బాబ్జీ నిర్థారించారు. ఇదే ఏడాది అక్టోబర్ నెలలో వివాహం జరగనున్నట్లు వెల్లడించారు.

DETAILS

అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పిన వంగవీటి రంగా

మరోవైపు రాధా పెళ్లిపీటలు ఎక్కనున్నారన్న విషయం తెలిసిన వంగవీటి అభిమానులు సంబురాల్లో తేలిపోతున్నారు. చానళ్లకు తమకు పండగ లాంటి వార్త అందిందని అంటున్నారు. రంగ కుమారుడిగా రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ఈ మేరకు 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం తరఫున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మల్లాది విష్ణు చేతిలో అతి తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీచేయగా మరోసారి చేదు ఫలితమే ఎదురైంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరినా ఆ ఎన్నికల్లో బరిలో నిలబడలేదు. అభిమానుల ఆహ్వానం మేరకు వంగవీటి రంగా విగ్రహాలను ప్రారంభిస్తూ సాగుతున్నారు.