Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించింది.
శనివారం పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
ఈ క్రమంలో 15 ఏళ్ల పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత ఇంధనం అందకూడదని కీలక నిబంధన తీసుకొచ్చారు.
15 ఏళ్ల వాహనాలకు ఇంధనంపై ఆంక్షలు
మంత్రి సిర్సా ప్రకటన మేరకు పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక గాడ్జెట్‌లు అమర్చనున్నారు.
వీటి ద్వారా 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తించి, వాటికి ఇంధనం అందకుండా చేయనున్నారు. ఈ ఆంక్షల గురించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం అందిస్తామని మంత్రి తెలిపారు.
Details
యాంటీ స్మోగ్ గన్ల అమలు
దిల్లీలో అధిక కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో యాంటీ స్మోగ్ గన్లు అమర్చడం తప్పనిసరి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహం
కాలుష్యాన్ని తగ్గించేందుకు 90 శాతం సీఎన్‌జీ బస్సులను డిసెంబర్ 2024 నాటికి దశలవారీగా ఉపసంహరించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.
కాలుష్య కట్టడిపై నిర్లక్ష్యానికి విమర్శలు
ప్రతేడాది శీతాకాలంలో దిల్లీ తీవ్ర వాయు కాలుష్యానికి గురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలకే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
కాలుష్య సమస్య కారణంగా విద్యా సంస్థలు మూతపడటం, విమానాల రాకపోకలకు అంతరాయం కలగడం, నగరవాసులకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం లాంటి సమస్యలు నెలకొంటున్నాయి.
Detals
తుక్కు విధానం అమలు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాలుష్య సమస్య ప్రధాన అంశంగా మారింది.
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై తీవ్ర విమర్శలు గుప్పించగా, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కొత్త ఆప్ సర్కారు కాలుష్య నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తుక్కు విధానాన్ని (Scrappage Policy) సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ విధానం ద్వారా పాత, ఫిట్‌నెస్ లేని వాహనాలను తొలగించడం ద్వారా కాలుష్యాన్ని అదుపులోకి తేనున్నారు.