Page Loader
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
09:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజకీయాల్లో ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్‌పర్సన్ అయిన జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు పంపించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన లేఖలో వివరించారు. ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఈ సందర్భంగా ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక గతాన్ని పరిశీలిస్తే, 2022 ఆగస్టు 11న ఆయన భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

వివరాలు 

కిసాన్ పుత్రగా ప్రత్యేక గుర్తింపు

అంతకుముందు 1990-91 మధ్య కాలంలో కేంద్రమంత్రిగా సేవలు అందించగా, 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన దేశ రాజకీయాల్లో కిసాన్ పుత్రగా ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధన్‌ఖడ్, గతంలో శాసనసభ సభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉపరాష్ట్రపతి చేసిన ట్వీట్