LOADING...
Vijay -Stalin: స్టాలిన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
స్టాలిన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

Vijay -Stalin: స్టాలిన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ సోమవారం మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీవీకే అధినేత విజయ్‌ డీఎంకే నాయకుడు స్టాలిన్ నివాసానికి వెళ్లగా, ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ నేతలు చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే గత డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఆయన ఆరోపించారు. దీనికి స్పందించిన స్టాలిన్‌.. రాష్ట్ర అప్పులు నియంత్రణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కొవిడ్‌ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిధుల విషయంలో అడ్డంకులు సృష్టించినప్పటికీ తమ ప్రభుత్వం సమర్థంగా నిలబడిందన్నారు.

వివరాలు 

సర్టిఫికేట్ మర్చిపోయి.. ప్రమాణస్వీకారం మిస్‌ అయిన మంత్రి కీర్తన..

ఈ పరిస్థితుల్లో విజయ్-స్టాలిన్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదివారం తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. మే 13న అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న మంత్రిగా ప్రమాణం చేసిన యువనేత కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఎన్నికల ధ్రువపత్రాన్ని తీసుకురావడం మర్చిపోయారు. దీంతో ఆమె వెంటనే ప్రమాణం చేయలేకపోయారు. అనంతరం తిరిగి వెళ్లి ధ్రువపత్రాన్ని తీసుకొచ్చి అధికారులకు సమర్పించడంతో చివరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement