Page Loader
PawanKalyan: విజయ్ రాజకీయ అరంగ్రేటం.. ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్
విజయ్ రాజకీయ అరంగ్రేటం.. ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్

PawanKalyan: విజయ్ రాజకీయ అరంగ్రేటం.. ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్ తన రాజకీయ ప్రవేశంపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్పందించారు. పవన్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లో ''తమిళనాడు ఎంతోమంది సాధువులు, సిద్ధుల నివాసం ఉండగా, రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు తన హృదయపూర్వక అభినందనలని పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెటిజన్ల మద్దతు పొందుతోంది. ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న విజయ్, ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు.

Details

ప్రజలు అశీర్వదించాలి : విజయ్

ఆదివారం ఈ పార్టీ తొలి మహానాడు జరిగింది. విజయ్ తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ, తాము ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని, తమిళనాడుకు ఇవి రెండు కళ్లులాంటివి అని చెప్పారు. తమ భావజాలం లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలను కలిగి ఉందన్నారు. రాజకీయాల్లో ఎదురైన విజయాలు, వైఫల్యాలను పరిశీలించిన తర్వాత, తన కెరీర్‌ను పీక్‌లో ఉండగా పార్టీ పెట్టానని, ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన అన్నారు.