
Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రం నుండి అనుమతులు అందిన వెంటనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
విశాఖ మెట్రో ప్రాజెక్టు కోసం డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రెపోర్ట్) సిద్ధంగా ఉందని, ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు.
కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.
Details
కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు
విశాఖ మెట్రో ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వాయిదా వేసినట్లు ఆయన విమర్శించారు.
ఈ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో కలిసి మాట్లాడినట్లు మంత్రి నారాయణ వివరించారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని ఆయన చెప్పారు.
విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నామని, రెండు దశలలో 4 కారిడార్ల రూపంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.