
Waqf Law:నేటి నుంచి అమలులోకి వక్ఫ్ సవరణ చట్టం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ సవరణ చట్టాన్ని నేడు (ఏప్రిల్ 8) నుండి అమలులోకి వచ్చింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. గత వారం ఉభయసభలూ ఈ సవరణ బిల్లును ఆమోదించాయి.
ఆ తర్వాత రాష్ట్రపతికి పంపగా, ఆమె ఆమోదం తెలిపారు.
అయితే, అది ఎప్పటి నుంచీ అమలులోకి వస్తుందన్న విషయం తేల్చలేదు.
తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఈ చట్టం ఏప్రిల్ 8 నుండి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 8న తన ఆమోదం తెలిపారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదించబడిన విషయం తెలిసిందే.
వివరాలు
రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఏప్రిల్ 4న రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి.
అంతకుముందు ఏప్రిల్ 3న లోక్‌సభలో దీని పై సుదీర్ఘ చర్చ జరిపి, 288 మంది సభ్యులు బిల్లుకు మద్దతుగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వక్ఫ్ సవరణ చట్టం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
The Waqf (Amendment) Act, 2025 receives the President’s assent and is now law —
— BALA (@erbmjha) April 5, 2025
a final nail in the coffin for unchecked Waqf property control. 🔥🔥 pic.twitter.com/RYa7JrSPIY