
Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) అధ్యయనం చేసిన 'వక్ఫ్ సవరణ బిల్లు-2024' నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇవాళ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించగా, సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి నివేదికను సభలో ప్రవేశపెట్టిన వెంటనే గందరగోళం ఏర్పడింది. విపక్ష ఎంపీలు తమ అసమ్మతి (డిస్సెంట్) నోట్ తొలగించారని ఆరోపిస్తూ నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సమావేశాలు పునఃప్రారంభమైనా విపక్షాలు నిరసన కొనసాగించాయి. అయినా రాజ్యసభ ఈ నివేదికను ఆమోదించింది.
Details
జేపీసీ నివేదిక కీలకాంశాలు
జనవరి 29న కమిటీ ముసాయిదా నివేదికను 15-11 మెజారిటీ ఓటుతో ఆమోదించింది. బీజేపీ సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించగా, ప్రతిపక్ష సభ్యులు సూచించిన మార్పులను తిరస్కరించింది. స్వీకరించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉండాలి. అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు అనుమతి. వక్ఫ్ అలాల్ ఔలాద్ (కుటుంబ వక్ఫ్)లో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాలి.
Details
ప్రతిపక్షాల వ్యతిరేకత
విపక్షాలు ఈ బిల్లును ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా అభివర్ణించాయి. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా మారుతుందని విమర్శించాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన (యూబీటీ), ఎఐఎంఐఎం వంటి పక్షాలు తమ అసమ్మతి నోటును సమర్పించాయి. బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వాదన వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ఆధునికత, పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లుకి ఉద్దేశం. వక్ఫ్ బోర్డులపై మరింత పర్యవేక్షణ అవసరమని బీజేపీ సభ్యుల వాదన. ఈ వివాదాల నడుమ రాజ్యసభ ఈ 'వక్ఫ్ సవరణ బిల్లు-2024' నివేదికను ఆమోదించింది.