Page Loader
Gautam Adani: మహా కుంభమేళాలో భక్తుల సేవలో గౌతమ్‌ అదానీ 
మహా కుంభమేళాలో భక్తుల సేవలో గౌతమ్‌ అదానీ

Gautam Adani: మహా కుంభమేళాలో భక్తుల సేవలో గౌతమ్‌ అదానీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కన్నుల పండువగా జరుగుతోంది. ఈమహా సంఘటనకు రోజుకు కోటిమందికిపైగా భక్తులు హాజరవుతున్నారు.మొదటి 8రోజుల్లోనే మొత్తం 8.81కోట్ల మంది భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తాజాగా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాను సందర్శించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇస్కాన్ టెంపుల్ వారు నిర్వహించిన ప్రసాద వితరణ క్యాంపులో అదానీ తన సేవలను అందించారు. ప్రసాదతయారీ ప్రక్రియలో కూడా ఆయన వ్యక్తిగతంగా పాల్గొన్నారు.ఇస్కాన్ టెంపుల్ వారు వెల్లడించిన వివరాల ప్రకారం,కుంభమేళా ముగిసే వరకు,అంటే జనవరి 13నుంచి ఫిబ్రవరి 26వరకు, ప్రసాద వితరణ కొనసాగుతుంది. అదానీ ప్రసాద తయారీ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అదానీ ప్రసాద తయారీ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో