Page Loader
Child Pornography Case: నేడు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..
నేడు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై తుది తీర్పు

Child Pornography Case: నేడు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు ఈరోజు(సోమవారం)మద్రాస్ హైకోర్టు ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వనున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్,జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. ఇంతకుముందు సుప్రీంకోర్టు,ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. పోక్సో,ఐటీ చట్టాల ప్రకారం ఇది నేరమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. జనవరి 11న,28ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకున్నాడని ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు క్రిమినల్ చర్యలను నిలిపివేసింది. అతడు వీడియోలు కేవలం చూసాడని,ఇతరులకు పంపలేదని పేర్కొంది.యువతను శిక్షించే బదులు,వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని హైకోర్టు సూచించింది.