
Rahul Gandi: వయనాడ్ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజల అభివృద్ధి కోసం తాము నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు.
అయితే కేంద్రంలో అధికారంలో లేకపోవడం వల్ల ఎక్కువ చేయలేకపోతున్నామంటూ తన బాధను వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ వయనాడ్ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారని, పారిశ్రామిక వేత్త అదానీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
మీడియా, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్నుశాఖలన్నీ మోదీ ఆధీనంలో ఉన్నాయని, కానీ తమకు ప్రజల అండ ఉందన్నారు. మోదీ ప్రభుత్వ అన్యాయాలపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ చెప్పారు.
Details
మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తా
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు యూడీఎఫ్ నేతలతో కలిసి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
వయనాడ్ ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
పార్లమెంట్ వేదికగా వయనాడ్ సమస్యలను ప్రపంచానికి వినిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీని నిలువరించడం కోసం ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారన్నారు.
వయనాడ్ ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
Details
ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది : ప్రియాంక గాంధీ
వయనాడ్ ప్రజల గొంతుకగా మారి, వారికి న్యాయం చేసేలా పార్లమెంట్ లో కృషి చేస్తానని ప్రియాంక గాంధీ తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేయాలని ప్రయత్నించినా, వయనాడ్ ప్రజలు కాంగ్రెస్‌కు బలంగా అండగా నిలిచారని పేర్కొన్నారు.
వయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ 4,10,931 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇది ఆమె రాజకీయ జీవితానికి మైలురాయిగా నిలిచింది.
ఈ విజయాన్ని ప్రజల నమ్మకానికి ప్రతిఫలంగా ఆమె గుర్తించారు.