LOADING...
Chandrababu: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించాం: సీఎం చంద్రబాబు
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించాం: సీఎం చంద్రబాబు

Chandrababu: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించాం: సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనుభవం, ప్రజల సహకారంతో కృషి చేసి ఏపీని దేశంలోని టాప్‌ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టామని అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆయన ప్రసంగించారు. '2019లో వచ్చిన ప్రభుత్వం ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్‌ను నాశనం చేసింది. పాలన వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. రూ.10లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేసింది. ఆ ఐదేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. రోడ్లపై గుంతలు పూడ్చడమే కాకుండా, పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయింది,

Details

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం

అమరావతి రాజధాని ప్రాజెక్టు ఆగిపోయింది, పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడి తరలిపోయాయని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు తవ్విన కొద్దీ వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. 2024 ఎన్నికల్లో "ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి" అనే ఎన్డీయే నినాదాన్ని నమ్మి చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలిపారు. నిశ్శబ్ద విప్లవం సృష్టించి, 94 శాతం స్ట్రైక్‌ రేట్‌, 57 శాతం ఓటు షేర్‌తో కూటమిని దీవించారని గుర్తుచేశారు. రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక లక్ష్యంగా పాలనను ప్రారంభించామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పనిచేశామని చెప్పారు.

Details

ఏడాది పాలన సంతృప్తినిచ్చింది

తొలి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగులు వేశామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ' కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు, ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.