BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను 'సంకల్ప పత్ర-Part 3' పేరుతో విడుదల చేసింది.
కేంద్రమంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టోను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు ఉండవని, దిల్లీ అభివృద్ధికి అవసరమైన పనుల జాబితా మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
బీజేపీ సంకల్ప పత్రం అసత్య వాగ్దానాలకు దూరంగా ఉంటుందని, ఆప్ ప్రభుత్వం దిల్లీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శంచారు.
యుమునా నదిని శుభ్రపరచడం, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని అమిత్ షా మండిపడ్డారు.
Details
కేజ్రీవాల్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది
కేజ్రీవాల్ ప్రభుత్వంలో అవినీతి మరింత పెరిగిపోయిందని ఆరోపించారు. కేంద్రం ఇప్పటికే దిల్లీ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.
రోడ్ల కోసం రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ. 21 వేల కోట్లు అందించామని వెల్లడించారు.
బీజేపీ అధికారంలోకి రాగానే మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తామని హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, 1,700 అనధికార కాలనీలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు.
Details
50వేల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తాం
రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తామని అమిత్ షా వెల్లడించారు.
ఇక, 50 వేల ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసి, 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఇక ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా, 8న ఫలితాలు వెలువడతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.