Revanth Reddy : 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ : సీఎం రేవంత్ రెడ్డి
2036 కల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించేలా చర్యలు చేపడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కూడా కోరినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పనకు తాము సిద్ధమన్నారు. ఇక గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విశ్వక్రీడలను హైదరాబాద్ లో నిర్వహించేందుకు అవకాశం కల్పించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో స్టేడియాలు నిర్మిస్తామన్నారు. దీనికోసం ఇప్పటినుంచే ప్రణాళిక బద్ధంగా పనులు చేస్తామని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.