Page Loader
Andhra Weather:  అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం - రాష్ట్రంలో వానల సూచనలు
అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం - రాష్ట్రంలో వానల సూచనలు

Andhra Weather:  అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం - రాష్ట్రంలో వానల సూచనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

గంగా పరివాహక ప్రాంతమైన పశ్చిమ బెంగాల్‌, సమీప ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, జూలై 7న ఉదయం 8:30కి నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్‌ సహా పరిసర ప్రాంతాలను విస్తరించి ఉంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి,పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉన్నది. ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశలో మెల్లగా కదిలే అవకాశం ఉంది.

వివరాలు 

 వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్ష సూచనలు 

ఇక ద్రోణి పరిస్థితిని పరిశీలిస్తే,ఇది దక్షిణ రాజస్థాన్ నుండి నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనానికి మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉంది. ఇది పైకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,యానాం మీదుగా దిగువ ట్రోపోస్ఫియర్లో పశ్చిమ దిశనుంచి గాలులు వీచుతున్నాయి. వీటి ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం: 

జూలై 7 (సోమవారం), 8 (మంగళవారం), 9 (బుధవారం): రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమూ ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: సోమవారం (జూలై 7): ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయి.

వివరాలు 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం: 

మంగళవారం, బుధవారం (జూలై 8-9): ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమ: సోమవారం, మంగళవారం, బుధవారం (జూలై 7-9): రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయి.